ఆత్మ విశ్వాసం కలిగిన అమ్మాయి ఉపాసన. పని చేయడంలో ఆడ, మెగా తేడా లేదని చాటిచెప్పిన వనిత. తమ అపోలో హాస్పిటల్స్ గ్రూపులో దాదాపు 50 శాతం కంటే ఎక్కువమందిని మహిళలనే నియమించుకొని స్త్రీలు ఎందులోనూ తీసిపోరని నిరూపించింది. అలాగే సినిమా రంగంలోనూ అమ్మాయిలు అడుగు పెడితే తప్పేంటని ప్రశ్నిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఇంట కోడలుగా అడుగు పెట్టిన ఉపాసన, మెగా ఫ్యామిలీలో అమ్మాయిలకు అండగా నిలుస్తోంది. సుస్మిత, నిహారిక నిర్ణయానికి మద్ధతు తెలుపుతోంది.
” నిహారిక చాలా స్ట్రాంగ్ అమ్మాయి. తను సినీ కెరీర్ లో తప్పకుండా రాణిస్తుంది. అలాగే సుస్మిత కూడా స్టయిలిస్ట్ గా చేస్తోంది. మామయ్య 150వ సినిమాకు తనే డిజైనర్. నాకు చాలా హ్యాపీగా ఉంది.” అని చెర్రీ సతీమణి ఉపాసన ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. మెగా ఫ్యామిలీలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు సినిమాల్లో భాగం కావడం తనకి సంతోషం కలిగిస్తోందని వివరించింది.