ఉపాసన వంటను మెచ్చుకున్న ప్యాష‌న్ డిజైన‌ర్!

  • November 7, 2017 / 12:52 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో లైఫ్ కి ఎండీ. అలాగే అపోలో ఫౌండేషన్ కి వైస్  చైర్ పర్సన్. అంతేకాదు చెర్రీకి సంబంధించిన అనేక వ్యాపారాలను దగ్గరుండి చూసుకుంటుంటారు. ఇంత బిజీ లేడీకి వంట గదిలోకి వెళ్ళడానికి సమయం దొరుకుతుందా? అసలు కుదరదు. కానీ ఉపాసన కిచెన్ లోకి వెళ్లడమే కాదు. రుచికరంగా వండుతుంది. టీలు, కాఫీలు కాదు.. అనేక ఇండియన్, కాంటినెంటల్ డిషెష్ అద్భుతంగా వండగలదు. ఇంటికి అతిధులు వస్తే స్వయంగా వండి వడ్డిస్తుంది. నిన్న ఉపాసన ఇంటికి   ప్ర‌ముఖ ప్యాష‌న్ డిజైన‌ర్ అబూ జానీ సందీప్ ఖోస్లా వ‌చ్చారు. ఆయ‌న‌కు ఉపాస‌న రుచికరమైన వంటలను స్వ‌యంగా వండి రుచి చూపించారు.

ఆ వంట‌ల‌ను తిన్న సందీప్ ఉపాస‌న‌ను మెచ్చుకున్నారు. “రామ్ చరణ్ అమ్మ రుచికరంగా వండుతుంది. అంతేవిధంగా ఆమె కోడలు ఉప్స్(ఉపాసన) కూడా మంచి టేస్టీ భోజనం పెట్టింది. ఈ ఆతిధ్యం మరచిపోలేను.” అంటూ సందీప్ చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉపాసన లో మంచి చెఫ్ కూడా ఉన్నారని తెలిసి చాలామంది సినీ జనాలు ఆశ్చర్య పోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus