నిన్నమొన్నటివరకు తమన్నాను ఒక గ్లామ్ డాల్ లా చూసినవాళ్లందరు ముక్కున వేలేసుకొనేలా చేసిన సినిమా “సైరా నరసింహారెడ్డి”. ఈ సినిమాలో చిరంజీవి తన నట విశ్వరూపం చూపిస్తే.. తమన్నా తన నట ప్రతిభను చాటుకొంది. నిన్నమొన్నటివరకు ప్రతి దర్శకుడు తమన్నాలోని గ్లామరస్ యాంగిల్ ను మాత్రమే వాడుకున్నాడు. కానీ.. తమన్నాలోని “ఊసరవెల్లి” తర్వాత పూర్తిస్థాయిలో వాడుకోన్న దర్శకుడు మాత్రం సురేండర్ రెడ్డి. సెకండాఫ్ లో సూసైడ్ బాంబర్ గా మారే సన్నివేశంలో తమన్నా నటన, ఆమె కళ్ల ద్వారా పలికించిన హావభావాలను ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అందుకే.. నయనతార కంటే ఎక్కువ అప్రిసియేషన్ తమన్నాకు వచ్చింది.
ప్రేక్షకులు, దర్శకనిర్మాతలు తమన్నాను మెచ్చుకోవడం అనేది కామన్ థింగ్. అయితే.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా తమన్నా నటనకు ఫిదా అయిపోయింది. “రచ్చ” సినిమా టైమ్ నుంచి ఉపాసన-తమన్నా మంచి స్నేహితులు. అందుకే.. తన ఫ్రెండ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కు ఒక కాస్ట్లీ డైమెండ్ రింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చింది ఉపాసన. అరచేతిలో పట్టేంత పెద్ద డైమెండ్ ను వేలికి పెట్టుకొని సిగ్గుపడుతున్న తమన్నా ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.