Upasana: బిడ్డ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం: ఉపాసన

  • April 21, 2023 / 01:29 PM IST

మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఈమె గురించి ఏ చిన్న విషయం తెలిసిన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఒక ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో ఈ మెగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. పెళ్లయిన పది సంవత్సరాల తర్వాత ఉపాసన రాంచరణ్ దంపతులు తల్లిదండ్రులకు కానున్న నేపథ్యంలో వీరికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉపాసన ఏడవ నెల ప్రెగ్నెంట్ కావడంతో మరికొద్ది నెలలలో ఈమె బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

ఈ క్రమంలోనే ఉపాసన (Upasana) తనకు పుట్టబోయే బిడ్డ గురించి అలాగే తన డెలివరీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజాగా చిరు ఇంట్లో ఉపాసనకు జరిగిన సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ గురించి కూడా కొన్ని విషయాలను తెలియజేశారు. తనకు జులై నెలలో డెలివరీ డేట్ ఇచ్చారని అప్పుడే బిడ్డకు జన్మనివ్వబోతున్నానని తెలిపారు.

ఇక ప్రతి ఒక్కరూ తమ బిడ్డ కోసం ఎదురు చూస్తుంటారు. అలాగే తమ బిడ్డ కోసం కూడా తాము చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని ఉపాసన తెలిపారు.ఇక రామ్ చరణ్ సైతం పుట్టబోయే బిడ్డ కోసం కొద్ది రోజులు షూటింగ్లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట.ఇక ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతిక్షణం రామ్ చరణ్ తనకు చాలా సపోర్ట్ చేస్తున్నారని ఉపాసన తెలిపారు.

ఇలా తమ బిడ్డ కోసం ప్రతి విషయంలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని బిడ్డ పుట్టిన తర్వాత కూడా తాను ఒకవైపు బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ మరోవైపు తన వృత్తిపరమైన జీవితంలో ముందుకు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నానని ఈ సందర్భంగా ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా జూలై నెలలో మెగా వారసుడు రాబోతున్నారనే వార్త తెలియడంతో అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus