టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ తేజ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. నటుడిగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి చరణ్ ప్రస్తుతం సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక రాంచరణ్ కెరియర్ పరంగా కామాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఈయన ఉపాసనని పెళ్లి చేసుకుని ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఇకపోతే ఉపాసన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన భర్త రామ్ చరణ్ గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. ఇటీవల రామ్ చరణ్ ఉపాసన ఇద్దరూ కూడా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఈ పోస్ట్ ను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరూ కూడా ప్రతి మగాడి విషయం వెనుక ఓ మహిళ ఉంటుందని చెబుతూ ఉంటారు కానీ నేను మాత్రం ప్రతి విజయం సాధించిన మహిళ వెనుక ఒక సపోర్ట్ చేసే వ్యక్తి సెక్యూర్ చేసే వ్యక్తి ఉంటారంటూ ఈమె తన గురించి తన భర్త రామ్ చరణ్ గురించి ఈ పోస్ట్ చేశారు.
ఇలా తన ప్రతి విజయంలోను రామ్ చరణ్ (Ram Charan) తనని వెనుకుండి ముందుకు నడిపిస్తున్నారని, ఉపాసన తన భర్త గురించి ఎంతో గొప్పగా చెబుతూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఉపాసన కూడా బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే. అదే విధంగా అపోలో హాస్పిటల్ బాధ్యతలు అన్నింటిని కూడా ఉపాసన చూసుకుంటూ తను కూడా వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉన్నారు.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!