మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చారిటీ విభాగానికి ఉపాధ్యక్షురాలైన ఉపాసన ఎప్పుడూ.. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటుంది. సామాజిక కార్యక్రమాలలో తో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన భర్త రాంచరణ్ సినిమా మరియు పర్సనల్ ఫోటోలని పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఉపాసన త్వరలో రాజకీయారంగేట్రం చేయబోతోందని… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ పై అపోజిషన్ అయిన కొండా విశేశ్వర్ రెడ్డి పై ఉపాసన పోటీకి దిగబోతుందంటూ గత కొంతలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తల పై ఉపాసన స్పందించింది.
విషయంలోకి వెళితే… ఉపాసనకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వయానా బాబాయ్. ఆమె పిన్ని సంగీతారెడ్డి భర్త. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి అల్లుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. చేవెళ్ల నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఎన్నికయ్యారు కూడా. అయితే కొన్ని కారణాల కారణంగా బయటకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ క్రమంలో… వచ్చే ఎన్నికల్లో ఇతని పై విజయం సాధించాలంటే ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలనే ఉద్దేశంతో… ఉపాసన సరైన ఛాయిస్ అని టిఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నట్టు ఓ ఆంగ్ల పత్రిక రాసుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులోనూ రాంచరణ్ , కేటీఆర్ లు కూడా మంచి స్నేహితులు కావడంతో ఇది నిజమే అని చాలా మంది అనుకున్నారు. అయితే ఆ వార్తలో ఎంత మాత్రం నిజం లేదని ఉపాసన స్పష్టం చేసింది. ఉపాసన స్పందిస్తూ… “ నేను రాజకీయాల్లోకి రాబోతున్నాని వస్తున్న వార్తలు అవాస్తవం. సంగీతా రెడ్డి నా బాస్. ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నా. చేవెళ్ళలో చిన్నాన్న చాలా అభివృద్ధి చేస్తున్నారు.., దయచేసి ఇలాంటి వార్తలను వైరల్ చేయొద్దు” అంటూ ఉపాసన క్లారిటీ ఇచ్చింది.