ప్రస్తుత జర్నీని ఆస్వాదిస్తున్న… ఉపాసన కామెంట్స్ వైరల్!

మెగా కోడలు ఉపాసన మరి కొద్ది రోజులలో అమ్మగా ప్రమోట్ కానుంది.రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి జరిగి పది సంవత్సరాలు అయినప్పటికీ పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. అయితే పిల్లలను ప్లాన్ చేయడానికి ఇది సరైన సమయమని భావించిన ఈ దంపతులు ప్రస్తుతం పిల్లలను ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఉపాసన ఏడవ నెల ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిందే. ఇక ఈమెకు దుబాయిలో తన స్నేహితులు, కజిన్స్ ఘనంగా సీమంతపు వేడుకలు కూడా చేశారు.

ఇలా తన భర్తతో కలిసి దుబాయ్ మాల్దీవ్ వెకేషన్ కి వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చిన ఉపాసన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయితే చాలామంది ఉపాసన బేబీ బంప్ అసలు కనిపించలేదు ఈమె నిజంగానే ప్రెగ్నెంటా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయానికి కూడా ఈమె ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ ప్రేగ్నేన్సీ ఒక వేడుకలా ఉండాలని కోరుకుంటూ.. ప్రస్తుతం ఈ జర్నీని తాను ఆస్వాదిస్తున్నానని తెలిపారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రపంచ దేశాలు అన్నింటిని చుట్టేసి వచ్చాను. ఈ సమయంలో నేను తీసుకోవాల్సిన ఆహారం గురించి డాక్టర్లు నాకు సలహాలు ఇచ్చారు. దుస్తుల గురించి మాట్లాడుతూ తాను నార్మల్ దుస్తులలోనే ఉన్నానని ఈ సందర్భంగా ఉపాసన తెలిపారు.

ప్రెగ్నెన్సీ సమయంలో ప్రత్యేకంగా తాను మెటర్నటీ క్లాత్ ధరించడం లేదు. అందుకే తన బేబీ బంప్ కూడా కనిపించడం లేదని తెలిపారు. ఇలా నార్మల్ దుస్తులలో కనిపించడానికి గొప్పగా భావిస్తున్నానని తెలియజేశారు. ఇలా ఉపాసన తన ప్రెగ్నెన్సీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus