ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యుష గరిమెళ్ల హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. పోలీసులు వెంటనే ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ఆమె పక్కనే పడి ఉన్న కార్బన్ మోనాక్సైడ్ సీసాను పోలీసులు స్వాధీనమా చేసుకున్నారు. ఊపిరి ఆడక కార్డియాక్ అరెస్ట్ అయినట్లు డాక్టర్స్ వెల్లడించారు.
విషవాయువు పీల్చడం వలనే శ్వాస ఆగిపోయి చనిపోయినట్లుగా డాక్టర్స్ ప్రిలిమినరీ ఒపీనియన్ వెల్లడించారు. డాక్టర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్యూష సూసైడ్ వల్లే చనిపోయినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ప్రత్యూష మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయిన అనంతరం కుటుంబ సభ్యుల కోరిక మేరకు ప్రత్యుష మృతదేహాన్ని అపోలో హాస్పిటల్ కి తరలించారు.
ఈరోజు హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోపక్క పోలీసులు ప్రత్యూష సూసైడ్ కి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. ప్రత్యూష టాలీవుడ్, బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసింది. ఆమె మరణంపై రామ్ చరణ్ భార్య ఉపాసన ఆవేదన వ్యక్తం చేసింది. ప్రత్యుషతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది.
”మై బెస్టీ మై డియరెస్ట్ ఫ్రెండ్. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తన మరణం నన్ను చాలా బాధిస్తోంది. ప్రతి విషయంలో ఎంతో బెస్ట్‌గా ఉండేది. ఇక కెరీర్, ఫ్యామిలీ, స్నేహితులు విషయంలోనూ ఉన్నత నిర్ణయాలు తీసుకునేది. అలా అన్ని విషయాల్లో ది బెస్ట్‌గా ఉండే ఆమె కూడా డిప్రెషన్‌కు గురైంది. తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా” అంటూ రాసుకొచ్చింది
Most Recommended Video
అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!