ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. మొదటి సీజన్ నుంచి 4వ సీజన్ వరకు ఎన్నో వివాదాలను దాటుకుంటూ మంచి రేటింగ్ తో వెళ్లిన బిగ్ బాస్ 5వ సీజన్ మాత్రం అంత ఈజీగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందననే విషయంలో అనేక రకాల రూమర్స్ అభిమానులను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయి.
ఇక ప్రస్తుతం అయితే మరొక గాసిప్ వైరల్ గా మారింది. నిజానికి 5వ సీజన్ ను త్వరగానే స్టార్ట్ చేయాలని అనుకున్నారు. జూన్ లేదా జులై స్టార్టింగ్ లో మొదలు పెట్టాలని ఒక ప్లాన్ కూడా సెట్ చేసుకున్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇక హోస్ట్ గా మరోసారి నాగార్జున ఫిక్స్ అని కూడా అర్ధమయ్యింది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు మరింత ఎక్కువవుతున్న తరుణంలో బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేంజ్ చేసినట్లు సమాచారం.
ఆగస్ట్ లేదా ఆ తరువాత బిగ్ బాస్ 5ను స్టార్ట్ చేయాలని ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఒకసారి నాగార్జునతో చర్చలు జరపగా ఆయన కూడా ఇప్పుడు రిస్క్ చేయడం అవసరం లేదని 4వ సీజన్ లాగా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఈసారి వర్కౌట్ కాకపోవచ్చని అన్నారట. అందుకే నిర్వాహకులు మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈసారి మొదలు పెడితే మాత్రం కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులను అప్సెట్ చేయకూడదని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు టాక్ వస్తోంది.