సొంత పార్టీ నుంచి బయటకొచ్చి మరో పార్టీ పెడుతున్నాడు!
- March 10, 2018 / 11:37 AM ISTByFilmy Focus
సరిగ్గా అయిదు నెలల క్రితం “కర్ణాటక ప్రజ్ఞావంత జనత పార్టీ” పేరుతో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి త్వరలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనేందుకు తాను సిద్ధం అంటూ ప్రకటించిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఉన్నట్లుంది తాను స్థాపించిన పార్టీకి తానే రిజైన్ చేశాడు. పార్టీలో చేరిన కొందరు సీనియర్లతో పడకపోవడంతోపాటు.. పార్టీలో సభ్యులెవరూ ఉపేంద్ర ఆలోచనాధోరణితో సింక్ అవ్వకపోవడంతో ఆ పార్టీకి రిజైన్ చేశాడు ఉపేంద్ర.
ఇప్పుడేమో తానే స్వయంగా మరో పార్టీ పెడతాను అని చెబుతున్నప్పటికీ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ కర్ణాటక రాజకీయ పెద్దలతో ఉపేంద్ర సమావేశమయ్యాడని, ఎమ్మెల్యే టికెట్ కూడా కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తోంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












