సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఉప్పెన’ చిత్రం విడుదలయ్యి 26 రోజులు కావస్తున్నా… ఇంకా డీసెంట్ కలెక్షన్లను రాబడుతూనే ఉంది. ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో విడుదలైనా.. ఓ పక్క కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్నా.. ఇంకా ఈ చిత్రం డీసెంట్ రన్ ను కొనసాగిస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం.అంతేకాదు కొత్త సినిమాల కలెక్షన్లను సైతం ‘ఉప్పెన’ డామినేట్ చేసేస్తూ వస్తోంది.ఈ వారం ఒక్క ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ ను పక్కన పెడితే.. ఏ కొత్త సినిమా కూడా ‘ఉప్పెన’ కలెక్షన్లను మించలేకపోయింది. ఇక కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేశాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలయ్యింది.
ఈ చిత్రం 26 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం | 15.43 cr |
సీడెడ్ | 7.70 cr |
ఉత్తరాంధ్ర | 8.50 cr |
ఈస్ట్ | 5.05 cr |
వెస్ట్ | 2.62 cr |
గుంటూరు | 2.96 cr |
కృష్ణా | 3.14 cr |
నెల్లూరు | 1.74 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 47.14 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.35 cr |
ఓవర్సీస్ | 1.38 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 50.87 cr (షేర్) |
‘ఉప్పెన’ చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే ఫినిష్ చేసింది ‘ఉప్పెన’. ఇక 26 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా 50.87 కోట్ల షేర్ ను రాబట్టి.. ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తోంది.నిన్న అంటే మంగళవారం నాడు కూడా ఈ చిత్రం 0.10కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం.
Click Here To Read Movie Review
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!