సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ అయిన ‘ఉప్పెన’ ఫుల్ రన్ ముగిసింది. ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో విడుదలైనప్పటికీ .. పోటీ బోలెడన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం ఎక్కడా తడబడలేదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించారు.
ఫిబ్రవరి 12న విడుదలైన ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం
15.63 cr
సీడెడ్
7.80 cr
ఉత్తరాంధ్ర
8.58 cr
ఈస్ట్
5.08 cr
వెస్ట్
2.63 cr
గుంటూరు
3.01 cr
కృష్ణా
3.21 cr
నెల్లూరు
1.78 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
47.72 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.38 cr
ఓవర్సీస్
1.42 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
51.52 cr (షేర్)
‘ఉప్పెన’ చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే చేధించింది. ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా 51.52 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే బయ్యర్లకు 30.52 కోట్ల ప్రాఫిట్ అన్న మాట. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే.. 85 కోట్లను కొల్లగొట్టింది ఈ చిత్రం.