తెలుగు రంగ ప్రవేశానికి రెడీ అవుతున్న బాలీవుడ్ హాటీ

ఆల్రెడీ సెక్సీయస్ట్ హీరోయిన్ గా బాలీవుడ్ లో మాంచి పేరున్న ఊర్వశి ఇదివరకూ “గ్రాండ్ మస్తీ” సిరీస్ లో రూపొందిన తాజా చిత్రంలో అందాలను ఏమాత్రం మొహమాటపడకుండా ఆరబోసిన విధానం, శృంగారం అనే పదం సైతం సిగ్గుపడేలా పండించిన సెక్స్ సీన్స్ చూసి కొందరు ఇబ్బందిపడగా.. ఇంకొందరు మాత్రం సంతోషకరమైన సంతృప్తితో సతమతమయ్యారు. అలాంటిది సెక్స్ సీన్స్ కు పెట్టింది పేరైన “హేట్ స్టోరీ” సిరీస్ లో ఊర్వశి నటిస్తుందంటే.. ఆ తరహా చిత్రాల కోసం ఎదురుచూసే ప్రేక్షకుల్లో ఆత్రం బాగా పెరిగిపోయింది. ఎక్స్ పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఊర్వశి రొటేలా ప్రేక్షకుల అంచనాలను తన అందాలతో అందుకోగలిగినా.. ఎందుక‌నో అమ్మ‌డికి అవ‌కాశాలు రాలేదు.

ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంద‌ట‌. ఇకపోతే ఈ భామ తెలుగు సినీ పరిశ్రమలో అరంగేట్రం చేస్తోందన్నది హాట్ టాపిక్. టాలీవుడ్ లో ఓ భారీ చిత్రంలో ఈ అమ్మడికి ఐటెమ్ భామగా అవకాశం వచ్చిందట‌. ఆ క్రమంలోనే ఇదిగో ఇలా పింక్ బికినీ ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. పింక్ టూపీస్ లో ఊర్వశి అందచందాలు మతిచెడే ట్రీట్ ఇస్తున్నాయి. ఇదే తీరుగా టాలీవుడ్ లోనూ చెలరేగితే అటుపై అవకాశాలు క్యూ కట్టడం ఖాయమేననడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus