UV Creations: యూవీ క్రియేషన్స్‌ ప్లానింగ్‌ బాగుంది కదా!

  • June 16, 2021 / 11:06 AM IST

టాలెంట్‌ ఉన్న కుర్ర టీమ్‌ను తీసుకొని సినిమాలు చేయడం యూవీ క్రియేషన్స్‌కు అలవాటు. ఇప్పటివరకు వారి ట్రాక్ రికార్డు చూసుకుంటే ఇలాంటివాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. ఇటీవల దీని కోసం ఏకంగా ‘యూవీ కాన్సెప్ట్స్‌’ అనే బ్యానరే పెట్టారు. ఈ క్రమంలో మరో కుర్ర టాలెంట్‌ను యూవీ సంస్థ వెతికి పట్టుకుందట. మంచి కథ విని.. ఓకే కూడా చేసేసుకుందట. త్వరలోనే సినిమా ముహూర్తం అని కూడా అంటున్నారు. అన్నట్లు ఆ టాలెంట్ పేరు చెప్పలేదు కదా… పేరు దీపక్‌.

దీపక్‌.. ఈ పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది కదా… ఆఁ మీకు గుర్తొస్తోంది కరెక్టే. గతేడాది వచ్చిన ‘మనసానమః’ అనే షార్ట్ ఫిల్మ్ దర్శకుడే దీపక్. అంతకుముందు కూడా కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశాడు కూడా. ‘డబ్ల్యూటీఎఫ్‌'(వాట్‌ ఈజ్‌ ది ఫ్యాక్ట్‌), ‘ఎక్స్‌క్యూజ్‌మీ’, ‘హైడెన్‌ సీక్‌’ లాంటి షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కించారు. అయితే ‘మనసానమః’కు చాలామంచి పేరు వచ్చింది. ఆ రోజుల్లో అనుష్క, రష్మిక లాంటి తారలు పొగుడుతూ ట్వీట్లు కూడా పెట్టారు.

70కి పైగా అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ఈ షార్ట్‌ ఫిల్మ్‌ దర్శకుడు దీపక్‌… ‘ఫిదా’ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేశాడు. ఇప్పుడు యూవీ క్రియేషన్స్‌ టీమ్‌కి కథ చెప్పి, ఓకే చేయించుకున్నాడట. ప్రస్తుతం ఆ కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. త్వరలో పనులు పూర్తి చేసి లాంచ్‌కి సిద్ధమవుతాడట. అయితే హీరో ఎవరు అనేది ఇంకా నిర్ణయించుకోలేదట.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus