Vaishnav Tej: రంగ రంగ వైభవంగా అయినా మెగా హీరోని గండం నుంచి కాపాడుతుందా?

  • June 20, 2022 / 07:27 PM IST

ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే గత రెండు సంవత్సరాల క్రితం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ సినిమా 2021ఫిబ్రవరి నెలలో విడుదల అయి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వైష్ణవ్ డెబ్యూ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈయనకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే వైష్ణవ్ తేజ్ హీరోగా కొండపొలం అనే నవల ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొండపొలం. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఈయన కెరియర్ కాస్త కష్టతరంగా మారిపోయింది. ఈక్రమంలోనే వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ప్రముఖ దర్శకుడు గిరీశాయ దర్శకత్వంలో రంగ రంగ వైభవంగా అనే చిత్రాన్ని చేస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో వీరిద్దరూ మెడికల్ స్టూడెంట్ పాత్రలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నటువంటి వైష్ణవి తేజ్ ను ఈ సినిమా మాత్రమే ఆ గండం నుంచి గట్టెక్కించగలదని నమ్మకంతో ఉన్నారు.ఈ సినిమా కనుక బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే కెరియర్ కొనసాగుతుందని లేదంటే కెరీర్ పూర్తిగా ఇబ్బందులలో పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి వైష్ణవ్ ఈ సినిమాతో అయినా గండం గట్టెక్కుతాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus