మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. అంతే కాకుండా అమ్మాయిలను కూడా ఈ కుర్రాడు బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. మొదటి సినిమా అయినా కూడా తన హావభావాలతో ప్రేమలోని మాధుర్యాన్ని వెండితెరపై చూపించాడు. అయితే సినిమా సక్సెస్ తో మనోడు గ్యాప్ లేకుండా వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు.అయితే ఒక ఇంటర్వ్యూలో వైష్ణవ్ చెప్పిన విషయం హాట్ టాపిక్ గా మారింది.
కాలేజ్ డేస్ లో ఎఫ్ఫైర్స్ ఏమైనా ఉన్నాయా లేక ఎవరైనా ప్రపోజ్ చేశారా అనే విషయాలపై కొన్ని ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. అయితే తాను ఎవరిని లవ్ చేయలేదని చెప్పిన వైష్ణవ్ కొన్ని క్రషేస్ మాత్రం ఉండేవని అన్నాడు. ముఖ్యంగా డిగ్రీలో ఉన్నప్పుడు ఒక సినియర్ అమ్మాయిని రెగ్యులర్ గా చూసేవాన్ని కానీ ఆమెతో మాట్లాడలేదని చెప్పాడు. ఆమె ఎప్పుడు బయటకు వస్తుందా అని క్లాస్ రూమ్ బయట వేయిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
అయితే మాట్లాడాలంటే భయం వేసేదని చెబుతూ ఇప్పటివరకు ఎవరికి ప్రపోజ్ చేయలేదని.. తనకు మాత్రం ముగ్గురు ప్రపోజ్ చేసినట్లు వైష్ణవ్ వివరణ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం కొందరు ఈ హీరో వయసు 25లో ఉంటుందని అనుకుంటున్నారు. కానీ వైష్ణవ్ అప్పుడే 30లోకి వచ్చేశాడు. ఇక నెక్స్ట్ మరో రెండు సినిమాలతో వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.