ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్నటువంటి చిత్రాలలో బేబీ సినిమా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లు నటించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఏకంగా 90 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇలా థియేటర్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో ప్రసారమవుతుంది. ఇక్కడ కూడా ఈ సినిమాకు అదే స్థాయిలో మంచి ఆదరణ లభిస్తుంది.
ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నటి వైష్ణవి చైతన్య పేరు కూడా ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఆహాలో ప్రసారమవుతున్నటువంటి నేపథ్యంలో ఆహా ఓటీటీ ‘వాట్సాప్ బేబీ’ పేరుతో వైష్ణవి చైతన్య వీడియోను పంచుకుంది. ఇందులో భాగంగా నేటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఈమె సమాధానాలు చెబుతూ వచ్చారు.. ఇందులో భాగంగా ఈమెను ప్రశ్నిస్తూ మీరు కనుక వీరాజ్ అశ్విన్ ఆనంద్ దేవరకొండ ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎవరిని చేసుకుంటారు అనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు వైష్ణవి చైతన్య సమాధానం చెబుతూ తాను వీరిద్దరిని పెళ్లి చేసుకోను అంటూ సమాధానం చెప్పారు. అయితే వీరిద్దరిలోనూ ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ తనకు బాగా నచ్చిందని తెలిపారు. బేబీ సినిమాలో వైష్ణవి చేసినది కరెక్టేనా అనే ప్రశ్న కూడా తనకు ఎదురు కావడంతో మనం ఇలాగే చేయాలి ఇలా చేయకూడదు అని పరిమితులు ఎప్పుడు పెట్టకూడదు కథ పాత్ర ఆధారంగా ఆ క్షణం ఏం చేయాలనిపిస్తే అది చేయాలని తెలియజేశారు.
ఇక మీకు వైష్ణవి (Vaishnavi Chaitanya) పాత్ర నచ్చిందా అని అడగడంతో చాలా బాగా నచ్చింది అంటూ ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య తనని ప్రశ్నించిన నెటిజన్స్ కు తన స్టైల్ లోనే సమాధానం చెప్పారు.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!