Vaishnavi Chaitanya: ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనున్న వైష్ణవి చైతన్య..!

  • December 9, 2023 / 07:16 PM IST

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో బేబీ సినిమా ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోగా ఆనంద్ దేవరకొండ నటించాడు. అలాగే ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా వైష్ణవి చైతన్య పేరు మారుమ్రోగింది. ప్రస్తుతం ఈ పేరును పరిచయం చేయాల్సిన పనిలేదు.

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని సంపాదించుకుంది. మొదట చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ క్రేజ్ దక్కించుకున్న వైష్ణవి చైతన్య ‘బేబీ’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు తిరుగులేదని ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చేస్తాయని అంతా అనుకున్నారు.. కానీ పాపం వైష్ణవి చైతన్యకి (Vaishnavi Chaitanya) అదృష్టం కలసి రాలేదని చెప్పాలి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా మాత్రమే ఉంది.

అయితే ఇటీవల స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్పిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయబోతుందని టాక్. మొదటగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఫైనల్లీ ఐటమ్ గర్ల్ గా చూస్ చేసుకున్నారట.

ఈ ఆఫర్ ని కూడా బేబీ డైరెక్టర్ సాయి దగ్గర ఉండి మరి ఆమె చేత ఒప్పించి.. సైన్ చేయించాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇండస్ట్రీలోకి ఏదో అయిపోతానని వచ్చి.. ఆఖరికి ఐటెమ్ సాంగ్స్ చేసుకునే స్థాయికి దిగజారిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus