దిల్ రాజుకి సంక్రాంతి రిలీజ్ కుదిరేట్టు లేదుగా

  • December 21, 2020 / 10:38 AM IST

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా “వకీల్ సాబ్” సంక్రాంతికి రిలీజ్ అయిపోతుంది, థియేటర్లకు పూర్వ వైభవం వచ్చేస్తుంది అని తెగ మురిసిపోయారు సినిమా అభిమానులు. పవన్ కళ్యాణ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కి డేట్స్ ఇవ్వడంతో రిలీజ్ పక్కా అనుకున్నారు జనాలు. కట్ చేస్తే.. డిసెంబర్ ముగియడానికి ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేదు. అలాగే.. సంక్రంతికి సరిగ్గా నెల రోజులు కూడా లేదు. దాంతో వకీల్ సాబ్ ముందు అనుకున్నట్లుగా జనవరిలో విడుదల చేయడం కష్టమే అని స్పష్టమవుతొంది.

ఒకవేళ సంక్రాంతి రిలీజ్ అనుకుంటే ఈపాటికి కనీసం టీజర్ అయినా రిలీజ్ చేసి ఉండాలి. కనీసం కొత్త పోస్టర్ కూడా రిలీజ్ అవ్వలేదు ఇప్పటివరకు. అయితే.. షూటింగ్ స్పాట్ నుంచి లీక్డ్ ఫోటోలు మాత్రం బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే.. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ తాగుబోతుగా నటిస్తున్నాడంటూ వచ్చిన వార్తల్లో పూర్తిస్థాయి నిజం లేదని తెలుస్తోంది. కేవలం రెండు సన్నివేశాల్లో మాత్రమే పవన్ తాగిన వాడిగా కనిపించనున్నాడు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, రూప కీలకపాత్రలు పోషిస్తుండగా..

ప్రకాష్ రాజ్ మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు వకీల్ సాబ్ ఆల్మోస్ట్ సంక్రాంతి రేస్ నుంచి అవుట్ అని కన్ఫర్మ్ అవ్వడంతో మిగతా సినిమాలన్నీ సంక్రాంతి బరిలో దిగడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి క్రాక్, రెడ్, తమిళ అనువాద చిత్రం మాస్టర్ రేస్ లోకి దూకాయి. మరి వకీల్ సాబ్ ఎప్పుడొస్తాడో, అభిమానుల ఆశల్ని ఎప్పటికి తీరుస్తాడో చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus