ప్రస్తుతం సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న దిల్ రాజు.. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో దిల్ రాజు… ‘తొలిప్రేమ’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసాడు. దిల్ రాజు పెట్టిన రూపాయికి 10రూపాయల లాభాలను తెచ్చిపెట్టింది ఆ చిత్రం. అప్పటి నుండీ దిల్ రాజుకి ఒక బలమైన కోరిక ఏర్పడింది. ఎప్పటికైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా తెరకెక్కించాలి అని..! ‘తొలిప్రేమ’ తరువాత పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ ‘గుడుంబా శంకర్’ ‘జల్సా’ ‘గబ్బర్ సింగ్’ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ వంటి చిత్రాలను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసాడు దిల్ రాజు.
అయితే సినిమా చేసే అవకాశం ఎప్పుడొస్తుందా అని 20 ఏళ్ళ నుండీ ఎదురుచూస్తున్నాడు. మొత్తానికి అది ‘వకీల్ సాబ్’ తో నెరవేరనుంది. వచ్చిన ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదని దిల్ రాజు ఫిక్స్ అయ్యాడు. అందుకే అమెజాన్ వారు ‘వకీల్ సాబ్’ చిత్రానికి 100 కోట్లు ఆఫర్ చేసినా సరే రిజెక్ట్ చేసాడు. కచ్చితంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని దిల్ రాజు భావిస్తున్నట్టు తెలుస్తుంది. దసరా నుండీ కొత్త కొత్త పోస్టర్స్ వదిలి ప్రమోషన్స్ మొదలపెట్టమని దిల్ రాజుకి పవన్ సూచించారట.
అయితే దిల్ రాజు పోస్టర్లతో పాటు టీజర్ మరియు లిరికల్ సాంగ్స్ ను కూడా విడుదల చేసి ప్రమోషన్లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడట. పవన్ సూపర్ హిట్ చిత్రాలైన ‘తొలిప్రేమ’ ‘ఖుషి’ ‘గబ్బర్ సింగ్’ చిత్రాల రికార్డులను తిరగరాసేలా ‘వకీల్ సాబ్’ ఉండాలని ఆయన భావిస్తున్నారట.
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!