అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ విలన్ పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వలీమై’. ఫిబ్రవరి 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది.అదిరిపోయే బైక్ రేస్ లు, యాక్షన్ సీక్వెన్స్ లతో ప్రేక్షకులకి ఓ విజువల్ ఫీస్ట్ ఫీలింగ్ ను కలిగించింది ఈ చిత్రం. దాంతో ‘వలీమై’ కి తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ లభించాయి.
అయితే తర్వాతి రోజున ‘భీమ్లా’ ఎంటర్ అవ్వడం చాలా వరకు డౌన్ అయిపోయింది.మొదటి సోమవారం రోజున ఈ చిత్రం పెద్దగా కలెక్ట్ చేయలేకపోయింది. ఒకసారి 5 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
0.45 cr
సీడెడ్
0.23 cr
ఉత్తరాంధ్ర
0.25 cr
ఈస్ట్
0.18 cr
వెస్ట్
0.14 cr
గుంటూరు
0.18 cr
కృష్ణా
0.16 cr
నెల్లూరు
0.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
1.70 cr
‘వలీమై’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు రూ.2.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.7 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.0.80 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు బాగానే రాణించిన ఈ చిత్రానికి ‘భీమ్లా’ గట్టి దెబ్బ కొట్టిందని చెప్పాలి.అయినప్పటికీ ఫస్ట్ వీకెండ్ కొంతవరకు ఓకె అనిపించిన ఈ చిత్రం… మొదటి సోమవారం రోజున ఢీలా పడిపోయింది. శివరాత్రి హాలిడే అయినా క్యాష్ చేసుకుంటుందేమో చూడాలి..!తమిళ్ లో అయితే ఈ చిత్రం సూపర్ గా కలెక్ట్ చేస్తుంది.