Jr NTR, Vamshi Paidipally: తారక్‌ బర్త్‌డే వేడుకల్లో వంశీ.. సినిమానా ఏంటి?

  • May 24, 2022 / 11:30 AM IST

దర్శకులు – హీరోల స్నేహాలు టాలీవుడ్‌కి కొత్తేం కాదు. ఒకప్పుడు సోషల్‌ మీడియా లేక వారి స్నేహాల గురించి ఎక్కడా పెద్దగా వినిపించేది కాదు. ఏ సభలోనో, కార్యక్రమంలోనే మాట్లాడేటప్పుడు ఆ విషయం చెప్పేవారు. అవునా, అంత మంచి స్నేహితులా అని ఫ్యాన్స్‌ అనుకొని మురిసిపోయేవారు. అయితే సోషల్‌ మీడియా వచ్చాక ఇలాంటి స్నేహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా కనిపించిన అలాంటి స్నేహం తారక్‌ – వంశీ పైడిపల్లి. అదేంటి మహేష్‌ – వంశీ ఎక్కువగా కనిపిస్తారు కదా అనుకుంటున్నారా? మీరే కాదు చాలామంది ఇదే అనుకుంటున్నారు.

తారక్‌ జన్మదినం సందర్భంగా ఇటీవల చిన్నపాటి ఏర్పాటు చేశారు. దానికి చాలామంది స్నేహితులు హాజరయ్యారు. చాలామంది సగటు సినిమా ప్రేక్షకుడికి తెలియకపోయినా వంశీ పైడిపల్లి మాత్రం బాగా తెలిసినవారు. ఆయన సతీసమేతంగా వేడుకకు హాజరయ్యారు. తారక్‌కు అతి దగ్గరగా ఉంటూ ఫొటోలు దిగారు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. మహేష్‌ బాబు క్యాంప్‌ నుండి వంశీ తారక్‌ క్యాంప్‌లోకి వచ్చేశారా అంటూ నవ్వులు కూడా వినిపిస్తున్నాయి. ఆ విషయం పక్కనపెడితే.. ఇద్దరూ సినిమా చేస్తారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

వంశీ పైడిపల్లి ఇప్పటికే తారక్‌కి ‘బృందావనం’ అనే కెరీర్‌ హిట్‌ ఇచ్చారు. ఆ సినిమాలో తారక్‌ లుక్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. అంత క్లాస్‌గా చూపించారు, అయితే ఎక్కడా మాస్‌ ఎలిమెంట్స్‌ తగ్గకుండా చూసుకున్నారు. మరోసారి ఇద్దరూ సినిమా చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమో చాలా రోజుల నుండి ఆ మాట వినిపిస్తోంది కానీ కుదరడం లేదు. ఇప్పుడు ఎన్టీఆర్‌ పుట్టిన రోజు వేడుకలో వంశీ కనిపించడంతో మరోసారి ఆ వార్తలు పతాక శీర్షికలు అవుతున్నాయి.

అయితే ఎన్టీఆర్‌తో వంశీ సినిమా అంటే కనీసం రెండేళ్లు ఆగాల్సిందే. ఎందుకంటే కొరటాల శివ సినిమా ఉంది. ఆ వెంటనే ప్రశాంత్‌ నీల్‌ సినిమా కూడా ఉంది. ఈ రెండూ అవ్వాలి.. అప్పుడే ఎన్టీఆర్‌ ఖాళీ అవుతారు. అయితే బుచ్చిబాబు సానా సినిమా ఉందని టాక్‌. మరి వంశీ సినిమా ఎప్పుడు అనేది తెలియాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus