“వర్మ” టార్గెట్ గా యాక్షన్ ప్లాన్ సిద్దం!!!
- December 29, 2016 / 01:35 PM ISTByFilmy Focus
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ దర్శకుడు వర్మ గురించి తెలియని వారు ఉండరు…సినిమాని కాంట్రొవర్షియల్ గా తీయాలి అని అనుకుంటాడో, లేక, కాంట్రొవర్షియల్ కధలను ఎంచుకుంటే సినిమాకు హైప్ వస్తుంది అని ప్లాన్ చేసుకుంటాడో తెలీదు కానీ…మొత్తానికి వర్మ తీసే సినిమాలు చాలా కాంట్రొవర్షియల్ గా ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు…అయితే అలా వచ్చిన వాటిల్లో ఈ మధ్య విడుదలయిన వంగవీటి మరింత ప్రాధాన్యతని సంతరించుకుంది…వర్మ సినిమాను తనకు నచ్చిన విధంగా తీశాడు అంటూ వంగవీటి ఫ్యామిలీ చెబుతుంటే….నిజాలనే తీశాను అని వర్మ కౌంటర్ ఇస్తూ వచ్చాడు…అయితే “వంగవీటి” సినిమా కారణంగా విజయవాడలో దేవినేని వర్సెస్ వంగవీటి మధ్య మళ్ళీ గొడవలు చెలరేగుతాయని అందరూ అనుకున్నారు. అయితే సినిమా రిలీజ్ తరువాత సీన్ రివర్స్ అయింది.
“వంగవీటి”సినిమాలో హీరోగా మొదలైన వంగవీటి పాత్ర…తరువాత తనని కాపాడుకోవటం కోసం రౌడీగా మలిచిన తీరుపై వర్మ కి కౌంటర్స్ ఎక్కువయ్యాయి. రాధా వర్గం వర్మ పై చాలా గుర్రు గా ఉన్నారు…ఇక వారి విమర్శలకు వర్మ ధీటుగా సమాధానం ఇస్తూ ఉండడంతో….అయితే ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి పెద్ద గోడవకే దారి తీసె ఛాన్స్ ఎక్కువుగా ఉందని అంటున్నారు బెజవాడ వాసులు…అయితే అదే క్రమంలో వర్మకు తమ సమాధానంగా పక్కా ప్లాన్ తో ముందుకు పోయేందుకు రెడీ అయ్యారు వంగవీటి మిత్ర మండలి. బెజవాడలో వినిపిస్తున్న వివరాల ప్రకారం…వర్మ కి త్వరలోనే వంగవీటి దెబ్బ ఎలా ఉండనుందో మిత్రమండలి చూపిస్తుందట…అదే క్రమంలో దానిపై ఓ యాక్షన్ ప్లాన్ రెడీ అయినట్టుగా విజయవాడ టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి…మరి ఆ ప్లాన్ ఏంటో ఏం జరగబోతుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












