చివరి దశలో “వంగవీటి” షూటింగ్..!!

  • June 30, 2016 / 01:07 PM IST

కాంట్రవర్సీ ని తన ఇంటి పేరుగా మార్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నోటికి వచ్చింది మాట్లాడటం,  చెప్పింది మర్చిపోవడం ఆయన స్పెషల్. ఈ ఏడాది ప్రారంభంలో విజయవాడకు చెందిన వంగవీటి రంగ, దేవినేని కుటుంబాల మధ్య గొడవల ఆధారంగా “వంగవీటి” సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు.

అంతేకాదు ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసాడు. వంగ వీటి రంగ కుమారుడు రాధాకృష్ణ ఈ చిత్రం రాకుండా అడ్డుకుంటానని చెప్పడం.. రామ్ గోపాల్ వర్మ ధైర్యంగా విజయవాడకు వెళ్లి.. వంగవీటి, దేవినేని కుటుంబ సభ్యలను కలవడం.. అప్పుడు పెద్ద సంచలనం అయింది. తర్వాత ఆ సినిమా ఊసే లేకుండా పోయింది. ఆ సినిమా కథ కూడా కంచికి చేరిపోయిందని అందరూ భావించారు. మళ్లీ ఇప్పుడు “వంగవీటి” సినిమా సంగతులు బయటికి వచ్చాయి.

వీరప్పన్ బిజీలో పడి వంగవీటిని పక్కన పెట్టారే తప్ప ఆ చిత్రాన్నిఆపలేదని సమాచారం. గత కొన్ని రోజులుగా “వంగవీటి” షూటింగ్ నిరంతరాయంగా జరుగుతోందని, త్వరలోనే చిత్రీకరణ పూర్తి అవుతుందని తెలిసింది. రక్త చరిత్ర ద్వారా రాయల సీమ ఫ్యాక్షనిజాన్ని కళ్ళకు కట్టిన ఆర్జీవీ .. ఇప్పుడు విజయవాడ రౌడీయిజాన్ని ఎంత మేర వెండితెరపై  చూపిస్తాడో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus