ఈ మధ్యనే మూడో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది వనితా విజయ్‌కుమార్.ఇప్పటికే ఈమె రెండు పెళ్లిళ్లు చేసుకుంది. కారణాలేంటో తెలీదు ఇద్దరితోనూ విడిపోయింది. అయితే ఇటీవల పీటర్ పాల్ అనే వ్యక్తిని ఈమె మూడో పెళ్లి చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే వనితను పెళ్లి చేసుకున్న పీటర్ కు కూడా ఇది రెండో పెళ్లి. ఈ క్రమంలో ‘నాకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడు’ అంటూ పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్ పోలీసులకు కంప్లైంట్ చేసింది.
ఈ విషయం పై న్యాయపోరాటం చేస్తానని వనిత కూడా తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై ప్రముఖ నటి అలాగే దర్శకురాలు అయిన లక్ష్మీ రామకృష్ణన్ స్పందించింది. “పీటర్ పాల్ రెండో పెళ్లి చేసుకునే వరకూ ఆయన మొదటి భార్య ఏం చేస్తుంది. ముందుగానే ఎందుకు కంప్లైంట్ చెయ్యలేదు. కేవలం డబ్బు కోసమే ఆమె ఫిర్యాదు చేస్తున్నట్టు ఉంది. వనిత చాలా కష్టాల్లో ఉంది. మూడో పెళ్లినైనా నిలుపుకుంటుందని ఆకాంక్షిస్తున్నాను” అంటూ ట్వీట్లో పేర్కొంది లక్ష్మీ రామకృష్ణన్. అయితే ఈమె ట్వీట్‌పై వనిత విజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటో మీకు తెలుసా? మీకు తెలియని విషయం పై ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంత అవసరం మీకు లేదు. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో నేను జోక్యం చేసుకోవడంలేదు. కాబట్టి, మీరు ఈ విషయంలో తలదూర్చటం మానేస్తే మంచిది. మీకు తెలియని వ్యక్తి గురించి మీ అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. తెలిసో తెలియకో ఈ వ్యవహారంలో నేను చిక్కుకున్నాను. ఎలా ఈ సమస్యను పరిష్కరించుకోవాలో నాకు తెలుసు” అంటూ వనిత .. లక్ష్మీ రామకృష్ణన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.