Vanitha Vijaykumar: హాట్ టాపిక్ గా మారిన వనితా విజయ్‌కుమార్‌ కామెంట్స్..!

నటి వనితా విజయ్‌కుమార్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఈమె నటిగా కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అయ్యింది. ఈమె పై చిన్న కామెంట్ చేసినా.. పెద్ద రచ్చ చేస్తుంటుంది. అప్పటి స్టార్ నటులైన మంజుల, విజయ్ కుమార్ ల కూతురే ఈ వనిత. ‘దేవి’ వంటి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.అయితే అటు తర్వాత ఈమె మరో సినిమాలో నటించలేదు. గతేడాది కరోనా లాక్ డౌన్ టైం లో మూడో పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది.

ఈమె పెళ్లి చేసుకున్నందుకు పెద్ద ఎత్తున దుమారం జరిగితే… చేసుకున్న వ్యక్తిని 3 నెలలకే తన్ని తరిమేసి మరింతగా హాట్ టాపిక్ అయ్యింది వనిత. ప్రస్తుతం యూట్యూబ్ లో వంటల ప్రోగ్రాంలు చేసుకుంటున్న వనిత అప్పుడప్పుడు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేస్తూ వస్తున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ నాకు తన 14 ఏళ్ళ వయసులోనే లైన్ వేసాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. కొద్దిరోజులుగా ఈ అమ్మడు 4వ పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో నిజం లేదని వనిత క్లారిటీ ఇచ్చింది. ‘నేను 4 వ పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇక పిల్లలే నా జీవితం. నేను గతంలో చేసిన తప్పులు భవిష్యత్తులో చేయకూడదని భావిస్తున్నాను. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు’ అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus