Vanitha Vijaykumar, Ramya Krishna: వనితా విజయ్ కుమార్.. రమ్యకృష్ణ ను ఎందుకు టార్గెట్ చేసినట్టు..!

  • July 5, 2021 / 08:23 PM IST

సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ.. ప్రస్తుతం ముఖ్య పాత్రల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ఈమె ఇమేజ్ మరింత పెరిగింది. ఒక్క బాలీవుడ్లో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఈమె నటిస్తోంది. ఇదిలా ఉండగా..ఓ హీరోయిన్ ఈమెను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.వివరాల్లోకి వెళితే..హీరోయిన్ వనితా విజయ్ కుమార్ నిత్యం ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ గా నిలుస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇటీవల ఆమె‘బిబి జోడిగళ్’ అనే డ్యాన్స్ షోలో పాల్గొంది.మాజీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ లతో ఈ షోని నిర్వహిస్తున్నారు. ఈ షోకి రమ్యకృష్ణ ఓ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే వనితా విజయ్ కుమార్ చేసిన ఓ డ్యాన్స్ పర్ఫామెన్స్ కి గాను.. రమ్యకృష్ణ 10కి ఒక్క పాయింట్ మాత్రమే ఇచ్చింది! దాంతో వనిత వెంటనే షో నుండీ బయటకు వెళ్ళిపోయింది. అంతేకాదు ఈమె అలా అర్ధాంతరంగా బయటకి వచ్చేయడానికి ఆ సీనియర్ లేడీ ఆర్టిస్ట్ కారణమని కామెంట్ చేసింది.

ఈ విషయం పై రమ్యకృష్ణని ప్రశ్నించగా…‘’ఆ డ్యాన్స్ షోలో ఏం జరిగిందో? మీరు వనితనే అడగండి. నన్ను కాదు’’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. రమ్యకృష్ణ మాట తీరుని వనిత స్టేజి పై చేయకూడనిది ఏదో చేసి ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పూర్తిగా ఒకరి వైపే మాట్లాడడం కూడా కరెక్ట్ చెన్నై మీడియా వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus