ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ కొన్ని రోజుల క్రితం తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్ ను పెళ్లి చేసుకున్నట్టు బిల్డప్ ఇస్తూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా వనితా విజయ్ కుమార్ ఆ ఫోటోను షేర్ చేశారని తేలింది. తాజాగా పికప్ అండ్ డ్రాప్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ వనితా విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిత్ర యూనిట్ కోరిక మేరకు సోషల్ మీడియాలో తాను ఆ ఫోటో షేర్ చేశానని తాను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను పంచుకుంటానని వనితా విజయ్ కుమార్ అన్నారు. తాను ఈ సినిమాలో కమెడియన్ గా నటించానని ఆ పాత్రతో మెప్పిస్తానని భావిస్తున్నానని ఫోటో వైరల్ కావడంతో తాను ఆశించిన విధంగా ప్రమోషన్ జరిగిందని వనితా విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.
పురుషులు 5 పెళ్లిళ్లు చేసుకున్నా ఎవరూ ఏమీ అనరని అవసరమైతే తాను 4 కాదు 40 పెళ్లిళ్లు చేసుకుంటానని వనితా విజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను సినిమాల నుంచి తప్పుకుంటే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని సినిమాల్లో జీవితాంతం కొనసాగాలనే ఆలోచన అయితే లేదని వనితా విజయ్ కుమార్ అన్నారు. పిల్లల్ని కన్న తరువాత సినిమా ఇండస్ట్రీకి దూరం కావడం తాను చేసిన అతిపెద్ద తప్పు అని వనితా విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.