తనపై వస్తున్న వార్తలపై స్పందించిన వరలక్ష్మి

  • October 8, 2018 / 10:23 AM IST

మంచి అయినా.. చెడు అయినా.. నిజమైనా.. అబద్ధమైనా.. ఏ విషయమైనా సోషల్ మీడియా వల్ల అత్యంత వేగంగా అందరికీ చేరుకుంటోంది. ఇదే సెలబ్రిటీలకు కొన్ని సార్లు తలనొప్పిగా మారుతోంది. రీసెంట్ గా ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి పెళ్లి త్వరలోనే ఉంటుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తమిళ హీరో విశాల్ ప్రేమలో ఉన్న వరలక్ష్మి.. పెళ్లిచేసుకోబోతోందని న్యూస్ హల్ చల్ చేసింది. దీనిపై వరలక్ష్మి స్పందించింది. “నాకు నిశ్చితార్థం జరగలేదు. పెళ్లీ చేసుకోవడం లేదు. అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు” అని స్పష్టం చేసింది.

అలాగే “చిత్ర పరిశ్రమలో ఇలాంటి వదంతులు సృష్టించి, నన్ను కిందకు లాగాలని చూస్తున్న వారందరికి ధన్యవాదాలు” అంటూ సెటైర్లు వేసింది. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ పైనే ఉందని.. తన కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని చెప్పింది. ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన పందెం కోడి 2 లో విశాల్ హీరోగా నటించగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఇందులో వరలక్ష్మి కీలకరోల్ పోషించింది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై జయంతి లాల్, అక్షయ్ లతో కలిసి విశాల్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 18 న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు “మారి 2”, “సర్కార్”, “శక్తి”, “నీయ 2 ” చిత్రాల్లో నటిస్తూ వరలక్ష్మి బిజీగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus