ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మీ శరత్ కుమార్.. హీరోయిన్ గానే కాకుండా విభిన్న పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా వచ్చిన విశాల్ ‘పందెం కోడి 2’ విజయ్ ‘సర్కార్’ చిత్రాలలో ముఖ్య పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలతో అటు కోలీవుడ్ ఆడియన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా …. విశాల్ తో వరలక్ష్మీ ప్రేమలో ఉన్నట్టు చాలాకాలం నుండీ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో నిజంలేదు మేము స్నేహితులం మాత్రమే.. అని వాళ్ళు చాలా సార్లు చెప్పినా.. ఆ వార్త ఏదో ఒకరకంగా కొనసాగుతూనే ఉంది.
అయితే ఇటీవల జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో వరలక్ష్మిని మూడు ప్రశ్నలడిగాడు ఓ వ్యక్తి అడిగాడు, అదేంటంటే…, ఒక ముద్దు ఇవ్వాల్సివస్తే, ఒకరిని చంపాల్సివస్తే, ఒకరిని పెళ్ళి చేసుకోవాల్సివస్తే.. వీటి మీ ఛాయస్ ఎవరెవరు? అని అడిగిన ప్రశ్నకు ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చింది వరలక్ష్మీ. ముద్దు ఇవ్వాల్సి వస్తే శింబుకు ఇస్తానని, చంపాల్సి వస్తే.. అది విశాల్‌నే అని, పెళ్ళి మాత్రం వేరే వ్యక్తిని చేసుకుంటానని సమాధానం చెప్పింది. ఇక తాజాగా వరలక్ష్మీ ముఖ్య పాత్రలో నటిస్తున్న ‘మారి2’ డిసెంబర్ 21 న విడుదల కాబోతుంది.