Varalaxmi: పక్కలో పడుకోమని అడిగారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటి?

తమిళ ఇండస్ట్రీలోకి సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలలో హీరోయిన్ గా నటించారు. అయితే ఈమె తెలుగులో పలు సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమాలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో నటించారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తను ఇండస్ట్రీలోకి రావడం తన తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదని అయితే బలవంతంగా తన తండ్రిని ఒప్పించి ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. అందరిలాగే తాను కూడా ఇండస్ట్రీలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని ఈమె తెలిపారు.

చిన్నప్పుడే తనపై లైంగికంగా దాడి జరిగిందని అలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక టీవీ ఛానల్ అధినేత తనని పక్కలోకి రమ్మన్నారు అంటూ ఈ సందర్భంగా ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా ఓ టీవీ అధినేత తనని పక్కలోకి రమ్మని చెప్పగానే పోరా పోరంబోకు అంటూ గట్టిగా అరవడంతో తను అక్కడి నుంచి పారిపోయారని ఈమె వెల్లడించారు.

ఇలా తన గురించి తాను ఎదుర్కొన్న సంఘటనల గురించి వరలక్ష్మి శరత్ కుమార్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈమె సినిమాలలో విలన్ పాత్రలలో నటించినప్పటికీ నిజజీవితంలో మాత్రం ఎంతో మంచి మనసు కలదని ఎన్జీవో సమస్త ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని చెప్పాలి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus