Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

‘మాకు నమ్మకం లేదు దొరా’… టాలీవుడ్‌లో ఏదైనా దర్శకుడి విషయంలో ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది అంటే అది కచ్చితంగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాత్రమే. రీసెంట్‌ టైమ్స్‌లో ఇతర దర్శకులు కొంతమంది సినిమాలు వాయిదా వేస్తున్నా.. రాజమౌళి సాటికి రారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పెద్ద మల్టీస్టారర్‌లు, పాన్‌ ఇండియా సినిమాలే కాదు చిన్న హీరోతో చేసే సినిమాకు కూడా వాయిదాలు ఇస్తుంటారు. గతంలో జరిగాయి కూడా. అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకు అని అనుకుంటున్నారా?

Varanasi

రీసెంట్‌గా ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి వస్తున్న లీకులు, సమాచారాలు.. అలాగే క్లారిటీలు వింటుంటే పూర్తి కన్‌ఫ్యూజన్‌ వస్తుండమే. సినిమా చాలా వరకు అయిపోయిందని చిన్న సీన్స్‌ కొన్ని ఉన్నాయని టీమ్‌ చెబుతోంది. అక్టోబరు నాటికి సినిమా షూటింగ్‌ పూర్తి చేస్తాము అని టీమ్‌ చెబుతోంది. అయితే ఇది మొదటి పార్ట్‌కా లేక ఒకటే పార్టా అనేది తర్వాత సంగతి. అయితే ఇంత పెద్ద సినిమా ఇంత త్వరగా ఎలా అయిపోతుంది. 90కిపైగా టేకులు తీసుకుంటున్న నటులు ఉన్న సినిమాలో ఇంత స్పీడంటే పెద్ద విషయమే.

మరోవైపు అయిపోయింది అని చెప్పాక తిరిగి రీషూట్లు చేసే రాజమౌళి ఇక్కడితో ఆగుతారా అనేదే డౌట్‌. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న రిలీజ్‌ చేస్తాం అని టీమ్‌ పదే పదే చెబుతోంది. అయితే ఇదంతా చేయాలంటే కనీసంలో కనీసం మార్చి మొదటి వారం నుండి ప్రచారం షురూ చేయాలి. ఇదంతా ఇండియాలో ప్రచారం అయితే. కానీ ఈ సినిమా ప్రపంచ వేదిక మీద నిలబెట్టే ఉద్దేశం ఉంది రాజమౌళి. ఆ లెక్కన ప్రచారానికి రెండు నెలలు అయినా కావాలి. అంటే జనవరి ఎండింగ్‌కి సినిమా అంతా రెడీ అవ్వాలి.

అక్టోబరులో షూటింగ్‌ అయిపోతే నవంబరు, డిసెంబరు, జనవరి నెలలు పోస్ట్‌ ప్రొడక్షన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సరిపోతాయా అనేది డౌట్‌. రాజమౌళి పనితనం తెలిసినవాళ్లు ఆయన ఈ పనులు మూడు నెలల్లో చేయడం కష్టమే అంటారు. దానికి తోడు ఈ సినిమాను 200 భాషల్లో రిలీజ్‌ చేస్తారని హీరోయిన్‌ ప్రియాంక చోప్రా చెబుతోంది. ఆ పనులకు కూడా ఎక్కువ టైమ్‌ పడుతుంది. మరి ఇంత పర్క్‌ ఉండి ఏప్రిల్‌లో సినిమా ఎలా రిలీజ్‌ చేస్తారో రాజమౌళినే చెప్పాలి.

అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus