విజయ్, సంతోష్ శోభన్ సినిమాల బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే?

  • January 13, 2023 / 06:45 PM IST

సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న వారసుడు, కళ్యాణం కమనీయం సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా వారసుడు, కళ్యాణం కమనీయం సినిమాలు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. క్రేజ్ ఉన్న థియేటర్లలో దిల్ రాజు వారసుడు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వారసుడు సినిమాకు కొన్ని థియేటర్లలో బుకింగ్స్ బాగానే ఉన్నా మెజారిటీ థియేటర్లలో మాత్రం బుకింగ్స్ ఆశించిన రేంజ్ లో లేకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

తెలుగులో ఈ సినిమాకు వచ్చే టాక్ ను బట్టి ఈ సినిమా బాగానే కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. వారసుడు సినిమా కూడా 2 గంటల 50 నిమిషాల నిడివితో థియేటర్లలో విడుదలవుతూ ఉండటం గమనార్హం. విజయ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం కూడా ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కళ్యాణం కమనీయం సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి.

ఏఎంబీ సినిమాస్ లో కూడా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగకపోవడం గమనార్హం. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమా రిలీజ్ విషయంలో తప్పు చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఆలస్యంగా థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే బెటర్ రిజల్ట్ దక్కేది.

కళ్యాణం కమనీయం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడం సులువు కాదు. దిల్ రాజు సొంత థియేటర్లలో మాత్రం వారసుడు సినిమాకు బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus