సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్యులకు, సెలబ్రిటీలకు మధ్య దూరం చాలా తగ్గింది. అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. హీరోయిన్లైతే తమ లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్ల నుండి ఒక్కోసారి వారికి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. తాజాగా యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కు అదే జరిగింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఓ గ్లామర్ ఫోటో షేర్ చేసింది.
ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ ఫోటో చూసిన ఓ నెటిజన్ ఏకంగా నన్ను పెళ్లి చేసుకుంటావా..? అంటూ కామెంట్ పెట్టాడు. తన వద్ద ఐదు ఎకరాల పొలం ఉందని.. మంచి ఇల్లు, గార్డెన్, ఓ కూతరు కూడా ఉన్నాయని.. అంతకుమించి నీ మీద చెప్పలేనంత ప్రేమ ఉందని సదరు నెటిజన్ రాసుకొచ్చాడు. దీంతో ఈ వెరైటీ ప్రపోజల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ‘మజ్ను’ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అను..
ఆ తరువాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈమె ‘మహాసముద్రం’ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా.. కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మ.. అల్లు శిరీష్ తో ప్రేమలో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ జంట ఇప్పటివరకు స్పందించలేదు!