Varun Tej, Lavanya: డెహ్రాడూన్ లో వరుణ్ లావణ్య రిసెప్షన్?

  • November 15, 2023 / 08:02 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠిని ఎంతో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలో నవంబర్ ఒకటవ తేదీ పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట అనంతరం హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ వేడుకను నిర్వహించారు. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం హాజరైన సంగతి తెలిసిందే. ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ వివాహం జరిగిన తర్వాత మొదటిసారి దీపావళి పండుగ రావడంతో ఈ కొత్త జంట తమ దీపావళి పండుగను హైదరాబాదులోనే వరుణ్ తేజ్ ఇంట్లో జరుపకున్నారు.

ఇలా వీరి దీపావళి వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక దీపావళి పండుగ పూర్తి కాగానే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తమ కుటుంబంతో కలిసి ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా మరోసారి రిసెప్షన్ వేడుక నిర్వహించబోతున్నారని తెలుస్తుంది.

అయితే ఈసారి మాత్రం లావణ్య త్రిపాఠి ఇంటిలో ఈ రిసెప్షన్ వేడుక జరగబోతుందని తెలుస్తుంది. పెళ్లి తర్వాత నేరుగా ఈ జంట హైదరాబాద్ వచ్చారు ఈ పెళ్లి వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కావడంతో లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు కూడా వారి కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి రిసెప్షన్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

లావణ్య త్రిపాటి (Lavanya) అయోధ్య దగ్గర ఒక ఊరిలో జన్మించారు అయితే ప్రస్తుతం మాత్రం వీరి తల్లిదండ్రులు డెహ్రాడూన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కొత్త జంట డెహ్రాడూన్ బయలుదేరినట్టు తెలుస్తుంది. ఇలా లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో మరోసారి వీరి రిసెప్షన్ వేడుక జరగబోతుంది. ఇక నిహారికతో పాటు తన తల్లిదండ్రులు కూడా డెహ్రాడూన్ వెళ్లారని వెళ్లినట్టు సమాచారం.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus