“ఫిదా” కోసం అమెరికా, “తొలిప్రేమ” కోసం లండన్ వెళ్ళడం కోసం ఫ్లైట్స్ ఎక్కి ఎక్కి బోర్ కొట్టేసిందేమో వరుణ్ బాబుకి అందుకే ఈసారి రాకెట్ ఎక్కడానికి సమాయత్తమవుతున్నాడు. వరుణ్ రాకెట్ ఎక్కడమేంటి అనుకుంటున్నారా.. నిజమైన రాకెట్ అనుకొనేరు, సెట్ అండి బాబు. “ఫిదా, తొలిప్రేమ” లాంటి డీసెంట్ హిట్స్ అనంతరం వరుణ్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం కోసం సమాయత్తమవుతున్నాడు. “ఘాజీ”తో ఇండియాలోనే మొట్టమొదటి అండర్ వాటర్ ఫిలిమ్ తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి.. ఈ తాజా చిత్రంతో తెలుగులో మొట్టమొదటి స్పేస్ ఎంటర్ టైనర్ రూపొందించనున్నాడు. క్రిష్ నిర్మాతల్లో ఒకడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇవాళ మొదలైంది. హైద్రాబాద్ లోని ఒక పాపులర్ స్టూడియోలో వేసిన సెట్ లో షూటింగ్ మొదలైంది. ఒక స్పేస్ షిప్ సెట్ వేశారట. ప్రస్తుతం అందులో గ్రీమ్యాట్ షూట్ జరుగుతోంది.
వరుణ్ తేజ్ సరసన అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠీలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం కోసం హైద్రాబాద్ లోని అన్నీ స్టూడియోస్ లోనూ సెట్స్ వేయడం విశేషం. ఎక్కువ షెడ్యూల్స్ ప్లానింగ్ లేకుండా లేట్ అవ్వకుండా షూటింగ్ ఫినిష్ చేసేందుకు ప్రీప్రొడక్షన్ వర్క్ చేయడం విశేషం. వీళ్ళ ప్లానింగ్ చూస్తుంటే అతితక్కువ టైమ్ లో టాలీవుడ్ కి బిగ్గెస్ట్ స్పేస్ ఎంటర్ టైనర్ అందిస్తారేమో అనిపిస్తుంది.