తమ్ముడికి దెబ్బ తగిలింది.. అన్నయ్య సంగతేంటో?

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొరత లేదు. ఒక్కో హీరోకి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఇక అభిమానులకైతే లెక్కలేనన్ని ఉంటాయి. రిలీజ్ డేట్, హీరోయిన్,డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆఖరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో సహా వారు చేసిన ముందు సినిమాలు ప్లాప్ అయితే అవి బ్యాడ్ సెంటిమెంట్ గా ఫిక్సయిపోతుంటారు. ఇప్పుడు అక్కినేని అభిమానులను కూడా ఓ సెంటిమెంట్ భయపెడుతుందట. తాజాగా నాగచైతన్య, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్నట్టు స్వయంగా చైతన్యనే ట్విట్టర్ ద్వారా తెలిపాడు.సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. దీంతో కొందరు అభిమానులు చైతూ కి మరో బ్లాక్ బస్టర్ రావడం ఖాయమని సంబరపడుతుంటే.. మరికొందరు అభిమానులు మాత్రం ఓ సెంటిమెంట్ ను తలుచుకుని భయపడుతున్నారట.

అదేంటంటే.. ఈ ఏడాది అఖిల్ హీరోగా ‘మిస్టర్ మజ్ను’ సినిమా వచ్చింది. ఈ సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రం డైరెక్టర్ గతేడాది వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’ సినిమా తెరకెక్కించి సూపర్ హిట్టందుకున్నాడు. ఇప్పుడు నాగచైతన్య కలిసి పనిచేయబోతున్న శేఖర్ కమ్ముల కూడా వరుణ్ తేజ్ తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సో ‘వరుణ్ డైరెక్టర్ తో తమ్ముడికి దెబ్బ పడినట్టే… అన్నయ్య కి కూడా దెబ్బ పడుతుందేమోనని’.. అభిమానులు భయపడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. చాలా విచిత్రంగా ఉంది కథా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus