Varun Tej: లావణ్య వరుణ్ తేజ్ పెళ్లిని వ్యతిరేకిస్తున్న ఫ్యాన్స్.. కారణం ఏంటో తెలుసా?

ఈ మధ్యకాలంలో మెగా కుటుంబంలోని ఉన్నటువంటి హీరోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటు ఉన్నారు. నిహారిక విడాకుల వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక విషయం ద్వారా మెగా ఫ్యామిలీకి సంబంధించిన సెలెబ్రిటీలు ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. తాజాగా మెగా ఇంటికి కాబోయే కోడలు లావణ్య త్రిపాటి గురించి కూడా ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గత ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ ఏడాది చివరిలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కువ పోతున్నారు ఇలాంటి తరుణంలోనే అభిమానులు లావణ్య త్రిపాఠినీ పెళ్లి చేసుకోవద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా వరుణ్ తేజ్ కు సలహాలు ఇస్తున్నారు. అసలు అభిమానులు ఇలాంటి ట్రోల్స్ చేయడానికి కారణమేంటి అనే విషయానికి వస్తే.. తాజాగా వరుణ్ తేజ్ నటించిన గాండీవ దారి అర్జున సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి మనకు తెలిసిందే.

అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత (Varun Tej) ఈయన ఇలాంటి డిజాస్టర్ సినిమాని ఎదుర్కొంటున్నారు అంటూ లావణ్య త్రిపాఠి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. లావణ్య త్రిపాఠి వరుణ్ లైఫ్ లోకి రావడం వరుణ్ కి కలిసి రావడం లేదని ఆమె ఐరన్ లెగ్ అని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే లావణ్యను వరుణ్ దూరం పెడితేనే మంచిది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మెగా ఇంటికి హీరోయిన్స్ కోడలుగా వచ్చి రారంటూ మరికొందరు ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ నటి రేణు దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. అందుకే హీరోయిన్స్ మెగా కోడలుగా కలిసి రారని అందుకే వీరిద్దరు పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ అంటూ అభిమానులు వారి అభిప్రాయాలను తెలియచేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాలి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus