Varun Tej, Lavanya Tripathi: హాట్ టాపిక్ గా మారిన వరుణ్ తేజ్ – లావణ్య..ల పార్టీ ఫోటోలు

Advertisement

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి..ల పెళ్లి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1 న .. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ల వివాహం ఘనంగా జరగబోతుంది. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ ఇటలీ చేరుకుని అక్కడ సందడి చేయడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా తన భార్యతో కలిసి ఇటలీ వెళ్లారు. మెగా ఫ్యామిలీ అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ పెళ్లి వేడుకకు చిరంజీవి తల్లిగారు అంజనా దేవి గారు వెళ్లలేకపోయారు అలాగే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. పిల్లలు అఖీరా, ఆధ్య లు కూడా వెళ్ళలేదు అని తెలుస్తుంది. ఇక అక్టోబర్ 30 నుండి వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ల వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. అక్టోబర్ 30 న .. కాక్ టెయిల్ పార్టీ ని ఏర్పాటు చేశారు. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల ఫ్యామిలీ మెంబర్స్ అలాగే స్నేహితులు కూడా ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు.

అయితే మెయిన్ గా రాంచరణ్ – ఉపాసన.. లు హైలెట్ అయ్యారు అని చెప్పొచ్చు. ఏదేమైనా అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంబరపడుతున్నారు. 7 ఏళ్లుగా ప్రేమించి .. పెళ్లి బంధంతో ఒక్కటవుతున్న వరుణ్ – లావణ్య లకి అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కాక్ టెయిల్ పార్టీ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus