మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం మిస్టర్ అభిమానులను నిరాశపరిచింది. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని తన కొత్త సినిమా ఫిదా షూటింగ్ లో బిజీ అయిపోయారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. దీని తరవాత వరుణ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ ప్రాజక్ట్ వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మొదట రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ని తీసుకున్నారు. అయితే అయన తప్పుకుని థమన్ వచ్చినట్లు తెలిసింది. ఈ మార్పు గురించి టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటుండగానే ఈ సినిమా ఆర్టిస్టులలో మార్పు జరిగింది.
వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ని హీరోయిన్ గా డైరక్టర్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాజక్ట్ నుంచి బయటికి వచ్చినట్లు తెలిసింది. డేట్స్ క్లాష్ కావడం వల్ల ఆమె ఈ వరుణ్ తో నటించే అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెహ్రీన్ రవితేజ రాజా ది గ్రేట్ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ఇక వరుణ్ కి సూటయ్యే బ్యూటీని వెతకడంలో చిత్ర బృందం పడింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.