మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాలు చేయడంలో వేగం పెంచాడు. శ్రీను వైట్ల తో మిస్టర్ సినిమా పూర్తి కాకముందే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి మధ్య ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఫిదా చిత్రం షూటింగ్ కొన్ని రోజుల క్రితం మొదలైంది. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తొలి చిత్రం కార్తికేయతో విజయం అందుకున్న చందు మొండేటి చెప్పిన కథ నచ్చడంతో అతని దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు.
అపరిచితుడు, గజని లో హీరోలకు ఉన్న వ్యాధి మాదిరిగానే ఈ కథలో హీరో కి ఒక వింత వ్యాధి ఉంటుందని సమాచారం. ఆ క్యారెక్టర్ రైజేషన్ నచ్చి వరుణ్ ఓకే చెప్పినట్లు తెలిసింది. చందు ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న ప్రేమమ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 9 న రిలీజ్ కానుంది. అనంతరం ఈ డైరక్టర్ వరుణ్ మూవీ స్క్రిప్ట్ పై వర్క్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని వాసుదేవా రెడ్డి, రాజ్ కుమార్ నిర్మించనున్నారు. మిస్టర్, ఫిదా సినిమాలను కంప్లీట్ చేసిన తర్వాత చందు టీమ్ తో వరుణ్ కలవనున్నాడు.