టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడే ‘ఫస్ట్ కిస్’ ఇచ్చా నంటున్నాడు మన ‘గద్దలకొండ గణేష్’ ….అదేనండీ మన వరుణ్ తేజ్. ఇటీవల మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ అనే షో లో వరుణ్ పాల్గొన్నాడు. ఈ షో లో తన రొమాంటిక్ లైఫ్ గురించి కూడా ఆసక్తికర విషయాల్ని తెలిపాడు. ‘ ‘ఫస్ట్ కిస్’ ఎప్పుడు ఇచ్చావ్ అంటూ మంచు లక్ష్మి ప్రశ్నించగా… వరుణ్ సమాధానమిస్తూ… ‘అది నాకు ఒక చెడు జ్ఞాపకం… దాని గురించి ఏమీ చెప్పలేను’ అని అన్నాడు.
‘ఫ్యాన్స్ తో మరిచిపోలేని సంఘటన ఏదైనా ఉందా? అనే ప్రశ్నకు బదులుగా…’ఒక రోజు స్నేహితులతో కలసి ఓ క్లబ్ కు వెళ్లాను… పార్టీలో డ్యాన్స్ చేస్తుండగా వెనుక నుంచి ఓ అమ్మాయి నన్ను హత్తుకుంది. నా స్నేహితుల్లో ఎవరో నన్ను పట్టుకున్నారని మొదట అనుకున్నాను… అయితే అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తే అమ్మాయి కనిపించింది. ఆ తర్వాత ఆమె నన్ను ముద్దు పెట్టుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ క్షణంలో నాకు ఎంతో భయం వేసింది. నా జీవితంలో ఇప్పటి వరకు ఎక్కువ ప్రపోజల్స్ రాలేదు’ అంటూ వరుణ్ చెప్పుకొచ్చాడు.