Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ ప్రారంభం

వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ ప్రారంభం

  • April 28, 2016 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ ప్రారంభం

ముకుంద, కంచె, లోఫర్ చిత్రాలతో తిరుగు లేని హీరో అనిపించుకున్న వరుణ్ తేజ్ మూడో సినిమా ‘మిస్టర్’ గురువారం హైదరాబాద్ లో ఆరంభమైంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ని అందించిన శ్రీను వైట్ల దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు.

దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ హీరో వెంకటేశ్ క్లాప్ ఇచ్చారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ర్ట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ – “ఎన్నో ప్రత్యేకతలున్న చిత్రం ఇది. చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీ విత్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ చేస్తున్నాను. ఈ కథలో ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఉంది. ఇప్పటివరకూ వరుణ్ తేజ్ చేసిన సినిమాలకూ, ఈ సినిమాకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇందులో యూనివర్శిటీ టాపర్ గా వరుణ్ కనిపిస్తాడు. ‘ఠాగూర్’ మధుగారు, బుజ్జిగారు ఎక్కడా రాజీ పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. యంగ్ టీమ్ తో చేస్తున్న సినిమా ఇది. తొలి షెడ్యూల్ స్పెయిన్ లోనూ, మలి షెడ్యూల్ బ్రెజిల్ లోనూ జరుపుతాం. ఆ తర్వాత ఎక్కువ శాతం షూటింగ్ ను కర్నాటక బోర్డర్ లో జరపడానికి ప్లాన్ చేశాం” అని చెప్పారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ”మంచి టీమ్ కుదిరింది. మంచి కథతో ఈ చిత్రం చేస్తున్నాం. ఈ బేనర్ లో, శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉంది” అన్నారు.
కథారచయిత గోపీమోహన్ మాట్లాడుతూ – ”శ్రీను వైట్లగారితో నాకిది పదో సినిమా. వరుణ్ తేజ్ తో ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. ఈ సినిమాలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. కామెడీ కూడా ఉంటుంది. ఈ చిత్రంలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, హీరోయిన్ల పాత్రలకూ అంతే ప్రాదాన్యం ఉంటుంది. సూపర్ హిట్ సాధించే చిత్రం అవుతుంది” అని చెప్పారు.
లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ – ”ఈ స్టోరీ చాలా బాగుంది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శక-నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.

ఈ వేడుకలో నిర్మాతలు ‘స్రవంతి’ రవికిశోర్, ‘దిల్’ రాజు, భోగవల్లి ప్రసాద్, భవ్యాస్ ఆనందప్రసాద్, పరుచూరి ప్రసాద్, డా. కె. వెంకటేశ్వరరావు, హీరో రానా తదితరులు పాల్గొన్నారు.
నాజర్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, పథ్వీ, సత్యం రాజేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్ సిపాన, రచనా సహకారం: మధు శ్రీనివాస్, వంశీ రాజేష్, సంగీతం: మిక్కీ జె మేయర్, కెమేరా: జె. యువరాజ్, ఎడిటింగ్: ఎమ్.ఆర్. వర్మ, ఆర్ట్: ఎ.యస్. ప్రకాశ్, స్టైలింగ్: రూపా వైట్ల, ప్రొడక్షన్ కంట్రోలర్: కొత్తపల్లి మురళీకృష్ణ, కో-డైరెక్టర్స్: బుజ్జి-కిరణ్, అసోసియేట్ డైరెక్టర్: సుభాష్, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya Tripathi
  • #Mister Movie
  • #Srinu vaitla
  • #Varun Tej

Also Read

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

related news

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

trending news

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

5 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

15 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

16 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

17 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

1 day ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

8 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

8 hours ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

9 hours ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version