ఫిదా ఆడియో వేడుకలో మాటలతో ఆకట్టుకున్న వరుణ్
- July 11, 2017 / 10:40 AM ISTByFilmy Focus
సినిమాలోకి రావడానికి తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తి అని వరుణ్ తేజ్ చెప్పారు. అతను నటించిన తాజా చిత్రం ఫిదా ఆడియో వేడుక ఆదివారం సందడిగా జరిగింది. ఈ వేడుకలో చక్కగా మాట్లాడి వరుణ్ అందరి అభినందనలు అందుకుంటున్నారు. మెగా కుటుంబం నుంచి ఏ హీరో రాకపోయినప్పటికీ మెగా అభిమానులందరూ ఫంక్షన్ కి వచ్చినందుకు వరుణ్ కృతజ్ఞతలు తెలిపారు. “ప్రతి ఫంక్షన్లో పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్, చరణ్ అన్న గురించి చెబుతుంటే కొంతమందికి బోర్ కొట్టచ్చు.. కానీ మనం ఎక్కడనుంచి వచ్చాము.. ఎలా వచ్చాము.. ఎందుకు వచ్చాము అనే విషయాలను ఇలాంటి వేదికపై మాట్లాడకపోతే చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. ఇంతమంది అభిమానులను నాకిచ్చినందుకు పెదనాన్నకు, బాబాయ్ కి థాంక్స్.” అని వివరించారు.
“ఫిదా మూవీలో హీరోయిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని డైరక్టర్ శేఖర్ కమ్ముల చెబితే నేను ఒప్పుకోలేదు.. నేను కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని మొదట్లో అడిగాను. కానీ అమ్మాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే, బాబాయ్ డైలాగులు ఆమె నోటి నుంచి వస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూడవచ్చు” అని వరుణ్ చెప్పారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జులై 21 న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















