Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?
- July 20, 2026 / 03:02 PM ISTByFilmy Focus Desk
అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే, ఏ ఇబ్బందీ లేకపోయి ఉంటే ఈ పాటికి ‘కొరియన్ కనకరాజు’ సినిమా విడుదలై ఉండేదేమో. లేదంటే కనీసం విడుదలకు దగ్గరగా వచ్చుండేది. ఆ సినిమా హీరో వరుణ్ తేజ్ గాయపడటంతో సినిమా పనులు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు సినిమా ప్రచారాన్ని చిత్రబృందం షురూ చేసింది. ఇప్పటికే వచ్చిన లుక్స్, టీజర్, సాంగ్ సినిమా మీద హైప్‌ను తీసుకురాగా.. ‘రాస గుమ్మాడీ’ అంటూ రెండో సాంగ్‌ని ఇప్పుడు రిలీజ్‌చేశారు.
Varun Tej
అనంతపురంలో జరిగిన ఈ ఈవెంట్‌కి హీరో వరుణ్ తేజ్ చేతి కర్ర సాయంతో వచ్చారు. ఏం జరిగింది అనే విషయం కూడా చెప్పారు. నిజానికి వరుణ్‌తేజ్‌కి గాయమైన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు ఫాలో అవ్వనివారికి ఇప్పుడు ఈ విషయం కొత్తగా తెలుస్తోంది. తన కాలికి దెబ్బ తగిలిందని… అందుకే కొంత కాలం రెస్ట్ తీసుకున్నట్లు వరుణ్ చెప్పాడు. ఒంట్లో బాగాలేక మూడు నెలలుగా ఇంట్లో నుండి బయటకు రాలేదు. ఈవెంట్‌కు వచ్చిన జనాలను చూసి గుండె నిండిపోయింది అని చెప్పాడు వరుణ్.
చిరంజీవి స్ఫూర్తితో ఈ సినిమాలో పాటలకు డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించాను అని చెప్పిన వరుణ్.. అభిమానుల కోరిక మేరకు రాయలసీమ యాసలో డైలాగ్ చెప్పారు. కాలికి గాయంతో ఇబ్బంది పడుతున్నా చేతి కర్ర సాయంతో ఈవెంట్‌కు వచ్చిన వరుణ్ తేజ్ డెడికేషన్‌పై ఫ్యాన్స్ నుండి ప్రశంసలు వస్తున్నాయి. యదు వంశీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కొత్త సినిమా చేయనున్న విషయం తెలిసిందే. వాలీ బాల్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ తీవ్రంగా గాయపడిన విషయయం తెలిసిందే.
ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్ కథలు ఎంచుకుంటూ సినిమాలు చేసే వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో మరో డిఫరెంట్ జోనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కొరియాకు చెందిన ఓ దెయ్యం రాయలసీమలో ఓ మనిషిని ఆవహిస్తే ఏం జరిగింది? అనేదే సినిమా. రాయలసీమ నుండి కొరియా వరకు హీరో చేసిన ప్రయాణమే కొరియన్ కనకరాజు. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్. ఈ సినిమా ఆగస్ట్ 7న విడుదల కానుంది.












