Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

‘కొరియన్‌ కనకరాజు’ సినిమాతో తిరిగి విన్నింగ్‌ ట్రాక్‌ ఎక్కాడు వరుణ్‌ తేజ్‌. వరుసగా పరాజయాలు అందుకుంటూ కెరీర్‌ని సంక్లిష్ట దశలోకి తనకు తాను తీసుకెళ్లిన వరుణ్‌.. ‘కొరియన్‌ కనకరాజు’ సినిమాతో స్వింగ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో మరోసారి తన ప్రయోగాల స్టైల్‌ను బయటకు తీస్తున్నాడు. ఇప్పటివరకు చేసినవన్నీ ఇలాంటి ప్రయోగాలే అనుకోండి. అయితే ‘కొరియన్‌ కనకరాజు’ విజయం తర్వాత అన్నీ అలాంటివే చేస్తాడు. లేదంటే మాస్‌ సినిమాలు చేస్తాడు అనే మాటలు వస్తున్న నేపథ్యంలో.. ప్రయోగం అనే ఆయుధాన్ని బయటకు తీశాడు.

Varun Teja

ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ ‘బరి’ ఇచ్చిన గాయం నుండి కోలుకుంటున్నాడు. ఇటీవల శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం రీహాబ్‌ దశలో ఉన్నాడు. అంతా సెట్‌ అయ్యాక ‘బరి’ సినిమా కోసం వాలీబాల్‌ గ్రౌండ్‌లోకి బరిలోకి దిగుతాడట. అయితే ఇప్పుడు విషయం అది కాదు. ఆ సినిమా తర్వాత వరుణ్‌ చేయబోయే సినిమా గురించి. ‘బరి’ అయిన వెంటనే మరో సినిమా బరిలోకి దిగుదామని ఫిక్స్‌ అయి వరుస కథలు వింటున్న వరుణ్‌ ఫైనల్లీ ఓ కథను దాదాపు ఓకే చేసేశాడు అని అంటున్నారు.

అన్నీ అనుకుంటున్నట్లుగా జరిగితే ఆ సినిమాకు త్వరలోనే కొబ్బరికాయ కొట్టేస్తారు అని చెబుతున్నారు. ప్రేమ కథగా రూపొందనున్న ఈ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ నిర్మాతగా వ్యవహరిస్తారట. కొణిదెల కుటుంబానికి సన్నిహిత తెలుగు నిర్మాత పార్ట్‌నర్‌గా ఉంటారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను అట్లీ శిష్యుడు బాలాజీ డీల్‌ చేస్తారని చెబుతున్నారు. దీనికి సాయి అభ్యంకర్‌ సంగీతం అందిస్తారట. అదే జరిగితే ‘రాకా’ కంటే ముందే సాయి టాలీవుడ్‌ డెబ్యూ ఈ సినిమాతో అయిపోతుంది.

ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే వినాయకచవితి రావాలి అని చెబుతున్నారు. ఆ రోజు అయితే సినిమాకు కొబ్బరికాయ లేదంటే పోస్టర్‌ లాంచ్‌తో అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని టాక్‌.

రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus