Veekshanam Review in Telugu: వీక్షణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 18, 2024 / 10:04 AM IST

Cast & Crew

  • రామ్ కార్తీక్ (Hero)
  • షైనింగ్ కశ్వి, నక్షత్ర నైనా (Heroine)
  • 'చిత్రం' శీను,దయానంద్ రెడ్డి, సమ్మెట గాంధీ, నాగ మహేష్, ఫణి,పింగ్ పాంగ్ సూర్య (Cast)
  • మ‌నోజ్ ప‌ల్లేటి (Director)
  • పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి (Producer)
  • సమర్ద్ గొల్లపూడి (Music)
  • సాయి రామ్ ఉదయ్ (Cinematography)

ఈ వారం ప్రేక్షకుల ముందుకు అన్నీ చిన్న చితకా సినిమాలే వస్తున్నాయి. అందులో ‘వీక్షణం’ ఒకటి. టీజర్, ట్రైలర్..లను బట్టి ఇదో మిస్టరీ థ్రిల్లర్ అనే క్లారిటీ వచ్చింది. ‘గీత సుబ్రహ్మణ్యం’ వంటి వెబ్ సిరీస్ తో పాటు ‘ధృవ’ ‘రామ్ అసుర్’ వంటి పలు సినిమాల ద్వారా పాపులర్ అయిన రామ్ కార్తీక్ ఇందులో హీరో. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందో చూద్దాం రండి :

Veekshanam Review

కథ: ఒక గేటెడ్ కమ్యూనిటీలో తన తల్లితో పాటు కలిసుండే అర్విన్ (రామ్ కార్తీక్).. తన ఫ్రెండ్స్ తో కలిసి బైనాక్యులర్స్ సాయంతో పక్క ఇళ్లలో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి నేహ(కశ్వి ) అనే అమ్మాయి తారసపడింది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. స్నేహితుల సహాయంతో ఆమెను కూడా ప్రేమలో పడేస్తాడు. మరోపక్క ఇంకో ఇంట్లో ఓ అమ్మాయి కొంతమంది అబ్బాయిలను తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అమ్మాయిలను కూడా తెచ్చుకోవడంతో హీరో ఆలోచనలో పడతాడు. విషయం ఏంటా..? అని ఆ అమ్మాయి ఇంట్లోకి చూస్తే.. ఆమె తీసుకెళ్లిన అమ్మాయిలను దారుణంగా కొట్టి, నరికి చంపేస్తూ ఉంటుంది.

ఇది చూసిన అర్విన్ షాకవుతాడు. స్నేహితులకి ఈ విషయాన్ని చెప్పి.. తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలనుకుంటాడు. అయితే పోలీసులు ‘ఆ అమ్మాయి చనిపోయి.. 8 నెలలు అయ్యింది.. ఇప్పుడు బతికొచ్చి మర్డర్లు ఎలా చేస్తుంది? అంటూ చెప్పి హీరో అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ కి ఇంకో షాకిస్తారు. మరి చనిపోయిన అమ్మాయి ఎలా మర్డర్లు చేస్తుంది? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : హీరో రామ్ కార్తీక్ లుక్స్ పరంగా ఇంప్రూవ్ అయ్యాడు. కానీ పెర్ఫార్మన్స్ పరంగా కాదు..! క్లోజప్ షాట్స్ లో అతను చాలా ఇబ్బంది పడ్డాడు అని స్పష్టమవుతుంది. హీరోయిన్ కశ్వి గ్లామర్ పరంగా కొంతవరకు ఓకే. నటన పరంగా ఆమె ఇంప్రెస్ చేసింది అంటూ ఏమీ లేదు. హీరో ఫ్రెండ్స్ లో ఒకడిగా చేసిన ఫణి అలియాస్ బమ్ చిక్ బంటీ .. అక్కడక్కడా నవ్వించాడు. తన పాత్రకి న్యాయం చేశాడు. నాగ మహేష్ కి మరోసారి మంచి పాత్ర దొరికింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సమ్మెట గాంధీ కూడా పర్వాలేదు అనేలా నటించాడు. దయానంద్ రెడ్డి ఎప్పటిలానే ఒక ఫర్నిచర్ టైప్ ఆఫ్ రోల్ చేశాడు. ఇక ‘చిత్రం’ శీను పాత్ర గెస్ట్ రోల్ నే తలపించింది.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు మనోజ్ పల్లేటి అనుకున్న లైన్ బాగుంది. కుల పిచ్చితో సొంత కుటుంబ సభ్యులనే చంపుకునే జనాలు ఇంకా ఈ సమాజంలో ఉన్నారని..! అలాంటి వాళ్ళు తమ పిల్లలను చాదస్తంతో పెంచితే ఎలాంటి ఘోరాలు సంభవిస్తాయి అనేది ఈ సినిమా లైన్. దీనిని ఓ క్రైమ్ థ్రిల్లర్ గా చెప్పాలనుకునే అతని ప్రయత్నం కూడా మంచిదే. కానీ దాని చుట్టూ అల్లుకున్న లెటర్స్ ఆకర్షణీయంగా లేవు. థ్రిల్లర్ సినిమాలు మొదటి పావుగంటలోనే ప్రేక్షకుల అటెన్షన్ డ్రా చేసే విధంగా ఉండాలి.

కానీ ‘వీక్షణం’ లో అది లోపించింది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వరకు హీరో ఫ్రెండ్స్ తో చేయించిన కామెడీ విసిగిస్తుంది. అక్కడి నుండి ఇంటర్వెల్ కార్డు పడే వరకు ఓకె. సెకండాఫ్ లో ఏదో విషయం ఉంది అనే ఆశలు రేకెత్తిస్తుంది. కానీ సెకండాఫ్ లో కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ను మినహాయిస్తే.. మిగిలినదంతా బోరింగ్ మెటీరియల్. సినిమా స్టార్టింగ్లోనే ఓ అమ్మాయి స్నానం చేసి బాల్కనీలో టవల్ తో తల తుడుచుకున్నట్టు చూపిస్తారు. తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతారు. అక్కడే ప్రేక్షకులకు ఓ ఐడియా వచ్చేస్తుంది ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని..! ఇవన్నీ స్క్రీన్ ప్లే లోపాలే.

నిర్మాణ విలువలు చెప్పుకోదగ్గ విధంగా లేకపోయినా టెక్నికల్ టీం పనితనం వాటిని మరిపిస్తుంది. సమర్ద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాయి రామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. రన్ టైం 2 గంటల ఒక్క నిమిషం మాత్రమే ఉండటం ఓ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.

విశ్లేషణ : మొత్తంగా ఈ ‘వీక్షణ’ ఓ బోరింగ్ క్రైమ్ థ్రిల్లర్. అక్కడక్కడా కొన్ని మెరుపులు ఉన్నా.. థియేటర్లో వీక్షించే విధంగా లేదు. ఓటీటీకి అయితే ఓకే.

రేటింగ్ : 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus