సాధారణంగా సీడెడ్ లో మాస్ యాక్షన్ సినిమాలు అంచనాలకు మించి విజయాన్ని అందుకుంటాయి. బాలయ్య సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా సీడెడ్ లో రికార్డ్ స్థాయి కలెక్షన్లను సాధించిన సందర్భాలు ఉన్నాయి. అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీడెడ్ బయ్యర్లకు కళ్లు చెదిరే లాభాలను అందించడం గమనార్హం. వీరసింహారెడ్డి సీడెడ్ హక్కులు ఏకంగా 15 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
బాలయ్య సినిమా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా నిర్మాతలకు ఈ సినిమాతో విడుదలకు ముందే మంచి లాభాలు వస్తున్నాయని తెలుస్తోంది. బాలయ్య పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకోవడం నిర్మాతల పాలిట వరం అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గోపీచంద్ మలినేని ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య శృతి హాసన్ జోడీ బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా త్వరలో శృతి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
శృతి కోరుకున్న సక్సెస్ ఈ సినిమాతో కచ్చితంగా దక్కుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. షూటింగ్ ను పూర్తి చేసిన తర్వాత మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇతర సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా బాలయ్య సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడం కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ఈ సినిమాకు 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను తీసుకున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వరుసగా నందమూరి హీరోలతో సినిమాలను నిర్మిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్య త్వరలో అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. అన్ స్టాపబుల్ షో సీజన్2 ను బాలయ్య విజయవంతంగా హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.