Samantha: సమంతపై వెంకీ కూతురి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరనే సంగతి తెలిసిందే. టాలెంట్ పుష్కలంగా ఉన్న సమంత కొంతకాలం బ్రేక్ తీసుకున్నా వరుసగా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. వరుసగా విహారయాత్రలు చేస్తూ మరింత యాక్టివ్ కావడానికి సమంత ప్రయత్నిస్తున్నారు. తన మేకప్ ఆర్టిస్ట్, స్టైలిష్ట్ తో కలిసి సమంత దుబాయ్ కు ప్రయాణమయ్యారు. ఆదివారం రోజున జరిగే క్రికెట్ మ్యాచ్ ను చూడటానికి సమంత దుబాయ్ వెళ్లారని తెలుస్తోంది.

తాజాగా సమంత పెయింటింగ్ గురించి చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. మనసు పెయింటింగ్ వేయలేదని చెబితే అప్పుడే మనం పెయింటింగ్ వేయాలని సమంత పేర్కొన్నారు. అలా వెంటనే చేయడం ద్వారా మన లోపల ఉన్న మాటలు ఆగిపోతాయని సమంత వెల్లడించారు. సమంత తాజాగా వేసిన పెయింటింగ్ గురించి నెటిజన్ల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. కరోనా వల్ల ప్రభావితమైన వాళ్ల కోసం ఈ పెయింటింగ్ వేస్తున్నట్టు సమంత వెల్లడించారు.

సమంత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ గురించి సినీ ప్రముఖులు స్పందించి తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అశ్రిత సమంత పోస్ట్ గురించి స్పందిస్తూ ఇక స్వేచ్ఛగా పెయింటింగ్ వేసుకో అని కామెంట్ చేశారు. మంచు లక్ష్మీ, మాళవికా నాయర్ కూడా సమంత పోస్ట్ గురించి స్పందించడం గమనార్హం. శాకుంతలం సినిమాలో శకుంతల పాత్రను పోషించిన సమంత ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటానని నమ్ముతున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus