వెంకటేష్ తో త్రివిక్రమ్ చేయనున్న సినిమాలో మహేష్ నటిస్తారా?

Advertisement

పవన్ కళ్యాణ్ తో చేస్తున్న అజ్ఞాతవాసి సినిమాకి మెరుగులు దిద్దే పనిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు. ఈరోజు టీజర్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. జనవరి 10 న రిలీజ్ అనంతరం ఈ ప్రాజక్ట్ పనులు కంప్లీట్ కానున్నాయి. దీని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు. ఆ స్క్రిప్ట్ పనులను రెండు నెలలలో పూర్తి చేయనున్నారు. ఫిబ్రవరి, లేదా మార్చిలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దీని తర్వాత వెంకటేష్ సినిమాని పట్టాలెక్కించనున్నారు. ఈ మూడు సినిమాలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. వెంకటేష్ తో త్రివిక్రమ్ చేయనున్న సినిమా మల్టీ స్టారర్ మూవీ అని ఫిలిం నగర వాసులు చెబుతున్నారు.

ఇందులో మహేష్ బాబు నటిస్తారని సమాచారం. గతంలో మహేష్, వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ చేశారు. అలాగే త్రివిక్రమ్ తో అతడు, ఖలేజా సినిమాలు చేశారు. వీరిద్దరితో ఉన్న స్నేహంతోనే ఇందులో నటించడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం వెంకటేష్ తేజ  దర్శకత్వంలో నటిస్తున్నారు. మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చేస్తున్నారు. దీని తర్వాత వంశీ పైడిపల్లి డైరక్షన్లో మూవీ చేయనున్నారు. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత వెంకీ, త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus